మంచి లాభాల్లో ఉన్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ షేర్లు అమ్మాలన్న.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతోంది. ఎల్ఐసీ షేర్లు అమ్మటం దుర్మార్గమని విశాఖలో జీవన్ సౌధా అపార్టుమెంటువాసులు ఆందోళన చేశారు. 32 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్ఐసీ ఇప్పటి వరకు ప్రభుత్వానికి నామమాత్రపు పెట్టుబడి కింద 26 వేల కోట్ల డివిడెండ్ చెల్లించిదని వారు తెలిపారు. ఎల్ఐసీ ఇప్పటి వరకు మౌలిక రంగాలపై 21 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందనీ.. దీని వల్ల దేశ పారిశ్రామిక ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడిందని వివరించారు. ఇటువంటి ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయటం ప్రభుత్వం చేయదగ్గ పని కాదని వారు హితువు పలికారు.
ఇదీ చదవండి: శ్మశాన వాటిక నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన