ETV Bharat / state

ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ - అవమానంతో పార్టీని వీడుతున్న నేతలు - leaving YCP

Leaders Leaving YSRCP Due to Change of Incharges: నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల మార్పుతో ఉత్తరాంధ్ర వైఎస్సార్​సీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మొదటి నుంచి జెండా మోసిన ముఖ్యనేతలు జగన్‌ తీరుతో అవమానాలు ఎదుర్కొలేక పార్టీని వీడుతున్నారు. మరికొందరు బయటకు చెప్పలేకపోతున్నా అదే ఆలోచనలో ఉన్నారు. ప్రతిసారీ సామాజిక న్యాయం పేరెత్తే జగన్‌ ఆచరణలో మాత్రం చూపడం లేదని మండిపడుతున్నారు. పెత్తనమంతా ఒక వర్గానికే అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

leaders_leaving_ycp
leaders_leaving_ycp
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 10:29 AM IST

Updated : Jan 5, 2024, 2:16 PM IST

ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ - అవమానంతో పార్టీని వీడుతున్న నేతలు

Leaders Leaving YSRCP Due to Change of Incharges: జగన్ శైలితో వైఎస్సార్​సీపీ నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం తమకు టిక్కెట్ ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి. తరతరాలుగా నియోజవర్గ ప్రజలను అంటిపెట్టుకుని రాజకీయం చేస్తున్న కుటుంబాలు సైతం తట్టా, బుట్టా సర్దుకుని చెప్పిన చోటకు వెళ్లాల్సి వస్తోంది. అధికారపార్టీ ఎమ్మెల్యే అండదండలతో ఇన్నాళ్లు నియోజకవర్గంలో తమకు తిరుగేలేదంటూ వ్యవహరించిన ద్వితీయ శ్రేణి నాయకులకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు. కొత్త నేత వద్ద ఇమడలేక పాతవారిని వదులుకోలేక సతమతమవుతున్నారు.

Visakhapatnam: గాజువాకలో ఎమ్మెల్యే నాగిరెడ్డి స్థానంలో కార్పొరేటర్ ఉరుకూటి చందును నియమించడంతో అక్కడ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలు వేర్వేరుగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాయి. విశాఖ పశ్చిమలో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ స్థానంలో విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనందకుమార్‌ను ఇన్‌ఛార్జిగా నియమించడంతో విజయప్రసాద్‌ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ వ్యవహార శైలిపై కార్పొరేటర్లు, తీరప్రాంత, కోస్తా మత్స్యకార సంఘం, బోటు ఆపరేటర్ల సంఘం సభ్యులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వాసుపల్లికి టికెట్ ఇస్తే పార్టీని వీడుతామంటూ ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు రాజీనామాలకు సిద్ధమయ్యారు.

'విశ్వసనీయత అంటే మాదీ నాదీ' అంటూనే నయవంచన- ఇదే జగ'నైజం'

Vizianagaram District: విజయనగరం జిల్లా రాజాం వైఎస్సార్​సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులును జిల్లా ఎల్లలు దాటించి పాయకరావు పేట సమన్వయకర్తగా నియమించారు. జోగులు 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు రాజాం నుంచి ఎన్నికయ్యారు. అంతకుముందు పాలకొండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జోగులు మార్పును స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేంచారు. కొత్త ఇన్‌ఛార్జి రాజేశ్‌ను మండలస్థాయి నేతలు ఇప్పటి వరకు కలవకపోవడం అక్కడ అసంతృప్తికి అద్దంపడుతోంది. శృంగవరపుకోటలో సిటింగ్ ఎమ్మెల్యే కడుబండి బండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకుమారి రఘురాజుల మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి వెళ్లాయి. కడుబండికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ 12 మంది సర్పంచులు, ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు రెండు రోజుల క్రితం మొరపెట్టుకున్నారు.

Alluri District: అల్లూరి జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని అరకు ఎంపీగా పంపి ఆమె స్థానంలో విశ్వేశ్వరరాజును ఇన్‌ఛార్జిగా నియమించడంతో ఆ సీటుపై ఆశ పెట్టుకున్న మాజీ మంత్రులు, వారి వారసులు భంగపడ్డారు. పార్టీని వీడేందుకు నిర్ణయించుకు న్నట్లు సమాచారం. అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు మొండిచేయి చూపి, ఎంపీ గొడ్డేటి మాధవిని తెచ్చి పెట్టడంతో స్థానిక ఆశావాహులు భగ్గుమన్నారు. వీరి మద్దతుదారులు ర్యాలీలు నిర్వహించి ఆందోళనకు దిగారు.

పెత్తందార్లకే పెత్తనం అప్పగిస్తున్న జగన్‌ - అగ్రవర్ణాల కిందే ఎస్సీ నియోజకవర్గాలు

Srikakulam District: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి, తూర్పు కాపు ఛైర్మన్ శ్రీకాంత్ మధ్య వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. పాతపట్నం జెడ్పీటీసి సభ్యురాలు లింగాల ఉపారాణి సైతం ఎమ్మెల్యే హాజరయ్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరో వైపు కొత్తూరు మండల ఉపాధ్యక్షుడు తులసీ వరప్రసాద్, తాను స్థానికుడినని, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వా లంటూ తెరపైకి వచ్చారు. పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజుకు అసమ్మతి సెగ తగులుతోంది.

టెక్కలి ఎమ్మెల్సీ శ్రీనివాస్ సోదరుడు కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్‌కు మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంతో అసంతృగా ఉన్నారు. వజ్రపుకొత్తూరు మాజీ పీఏసీ ఛైర్మన్ దువ్వాడ హేమంత్‌బాబు చౌదరి సైతం మంత్రి తీరుపై విసుగుచెంది పార్టీని వీడారు. అగ్నికుల క్షత్రియ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడి సోదరుడు జగన్నాయకులు పలాస టికెట్‌ ఆశిస్తున్నారు. మందసం మండల పార్టీ అధ్యక్షుడు ప్రమాదంలో చనిపోగా, ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ వర్గీయులంతా సీదిరికి వ్యతిరేకంగా ఉన్నారు.

ఇదేం సామాజిక న్యాయం- అన్నిటా జగన్ సొంత నేతల ఆధిపత్యమే! పార్టీలో ఉక్కిరిబిక్కిరవుతున్న నేతలు

Leaders Leaving YCP in Uttarandhra: విశాఖలో వైఎస్సార్​సీపీకు ఎదురుగాలి వీస్తోంది. కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను జగన్‌కు పరిచయం చేసేందుకు ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నా అవకాశం రాలేదని బూతులు తిట్టడం చేతగాకే వైఎస్సార్​సీపీలో వెనుకబడినట్లు భావిస్తున్నానని అంటూ వైఎస్సార్​సీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలో పంచకర్ల రమేశ్ బాబు ఆరోపించారు. తరువాత ఆయన జనసేనలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నడిచిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేసి తాజాగా జన సేనలో చేరారు. సీఎం జగన్‌ను కలిసేందుకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

పార్టీ కోసం 60 ఎకరాలు అమ్ముకున్నానని, జెండా మోసిన తనకు అన్నీ అవమానాలే ఎదురయ్యాయన్నారు. ముఖ్యమంత్రి జగన్, అయన కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యులకు అత్యంత సన్నిహితంగా ఉండే ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ సైతం పార్టీకి రాజీనామా చేశారు. తొమ్మిది నెలల నుంచి ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పైగా పార్టీ కోసం నియోజకవర్గ పరిధిలో చేస్తున్న కార్యక్రమాలను సైతం అధిష్టానం అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

Anakapalli District: అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైఎస్సార్​సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు కుటుంబం కూడా వైఎస్సార్​సీపీలో తమకు తగిన ప్రాధాన్యం లేదంటూ పార్టీని వీడారు. వైఎస్సార్​సీపీను వీడుతున్న నేతలంతా తెలుగుదేశం, జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే పంచకర్ల రమేశ్‌, వంశీకృష్ణ శ్రీనివాస్‌ జనసేనలో చేరగా సీతంరాజు సుధాకర్ తన అనుచరులతో తెలుగుదేశంలో చేరాలని భావిస్తున్నారు. దాడి వీరభద్రరావు ఇప్పటికే చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.

Last Updated : Jan 5, 2024, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.