ప్రభుత్వ శాఖల్లో స్థానచలనాలకు సిబ్బంది పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులకు చివరి రోజు కారణంగా... వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయితీరాజ్, జలవనరులు, ప్రజారోగ్యం వంటి శాఖలలో సిబ్బంది పెద్ద ఎత్తున ప్రక్రియకు హాజరయ్యారు. వీఆర్ఓ స్థాయి నుంచి ఉద్యోగుల బదిలీలకు ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలు పెద్ద ఎత్తునే ఆయా విభాగాధిపతులకు పంపారు. అధికారులతో కూడిన కమిటీ ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తోంది. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో వైద్యారోగ్య శాఖ నర్సులు, ఎఎన్ఎంల బదిలీ కౌన్సిలింగ్ కేంద్రంలో చివరి రోజున ఇది ఎక్కువగా కనిపిస్తోంది.
ఇదీ చూడండి శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమైన వైకాపా సర్కార్