జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలో విశాఖ జిల్లా కసింకోట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రతిభ కనబరిచింది. పూలే విద్య అభివృద్ధి పరిశోధన కేంద్రం ఆన్లైన్లో నిర్వహించిన పోటీల్లో.. పర్యావరణ పరిరక్షణపై.. వేసిన చిత్రం బంగారు పతకంతో పాటు.. నేషనల్ ఆర్ట్ ఎక్సలెన్సీ అవార్డు గెలుపొందింది. ప్రతిభ చూపిన విద్యార్థిని సౌమ్య శ్రీ లక్ష్మీని.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మాకర్, ఉపాధ్యాయులు అభినందించారు.
ఇవీ చూడండి: