ఇటీవల కురిసిన వర్షాలకు విశాఖ జిల్లా చీడికాడ మండలం కోణం జలాశయం జీవం పోసుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 94.2 మీటర్లకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి 50 క్యూసెక్కులు వరకు నీరు జలాశయంలో చేరుతుంది. జలాశయం నీటిమట్టం పెరగడంతో ఖరీఫ్ సాగు నీటి కష్టాలు తీరుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జలాశయం పరిధిలో 14 వేల 450 ఎకరాలకు చీడికాడ మండలంతో సహా మాడుగుల, దేవరాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం మండలాలకు చెందిన ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుంది. వర్షానికి జలాశయంలో నీరు పెరగడంతో కొద్దిరోజుల్లో ఖరీఫ్ వరినాట్లకు సాగు నీరు విడుదల చేయనున్నట్టు జలాశయం సాగునీటి కమిటీ ఛైర్మన్ ముసలి నాయుడు చెప్పారు.
ఇది కూడా చదవండి.