విశాఖలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 20న అర్ధరాత్రి సమయంలో టీఎస్ఆర్ కాంప్లెక్స్ ఎదుట పుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో నిద్రిస్తోన్న బాలుణ్ని ముగ్గురు దుండగులు అపహరించారు. ఉదయం లేచి చూసే సరికి బాలుడు కనిపించకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.
ఆటోలో రెక్కీ నిర్వహించి బాలుడ్ని ఎత్తుకెళ్లిన సల్మాన్ ఖాన్, షేక్ సుభాని, రోషన్ రాజులను పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం పూల్‌బాగ్ వద్ద బాలుడ్ని గుర్తించిన పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. రోషన్ రాజు బంధువు అయిన ఓ మహిళకు పెంచుకోవడానికి బాలుడు కావాలని.. అందుకనే కిడ్నాప్‌నకు పాల్పడ్డామని నిందితులు పోలీసు విచారణలో వెల్లడించారు. నిందితులు గతంలో ఈ తరహా కిడ్నాప్‌లకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా విచారించనున్నారు. నిందితుల నుంచి ఓ ఆటో, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: