ఖుర్దా రోడ్- అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏ.కె. త్రిపాఠి తెలిపారు. ఖుర్దా రోడ్-అహ్మదాబాద్ (08407) ప్రత్యేక వారాంతపు ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 21 వరకు ప్రతి బుధవారం ఖుర్దా రోడ్లో బయలు దేరనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08408) అక్టోబర్ 3 నుంచి 24 వరకు ప్రతి శనివారం అహ్మదాబాద్లో బయలుదేరుతుందన్నారు.
ఆగే స్టేషన్లు..
బ్రహ్మపూర్, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రపూర్, వార్ధా, బద్నేరా, భూసాబల్, జల్గావ్, నందూర్బార్, సూరత్, భార్చ్ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.
ఇదీ చదవండి: నేటి నుంచే భారత్, జపాన్ల మధ్య 'జిమెక్స్' నావికా విన్యాసాలు