ETV Bharat / state

విశాఖ ఘటనతో తెలంగాణలో కలవరం - vizag gas leak

విశాఖపట్నంలో గ్యాస్​ లీకేజీ ఘటనతో తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 210 పరిశ్రమలున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పారిశ్రామికవాడలు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూసి వేసినప్పటికీ మళ్లీ తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి యాజమాన్యాలు.

khammam-district-people-afraid-of-vizag-gas-leak-incident

author img

By

Published : May 9, 2020, 12:09 AM IST

విశాఖ గ్యాస్​ లీక్​ ఘటన తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 210 పరిశ్రమలున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పారిశ్రామికవాడలు విస్తరించి ఉన్నాయి.అయితే ఆయా పరిశ్రమలు నిబంధనల మేరకు మాత్రమే వాయు ఉద్గారాలు విడుదల చేస్తున్నాయని కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది.

ఉభయ జిల్లాల్లో వెలువడే వాయువులివీ..

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గ్రానైట్‌, బొగ్గు, కాగితం, విద్యుత్తు, భారజల కేంద్రం తదితర పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి ప్రధానంగా నాలుగు రకాల వాయువులు వెలువడతాయని అధికారికంగానే వెల్లడిస్తున్నారు. అయితే అవి తగిన మోతాదులోనే ఉద్గారాలు విడుదల చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

  • - హైడ్రోజన్‌ సల్ఫైడ్‌
  • - కార్బన్‌ మోనాక్సైడ్‌
  • - కార్బన్‌ డై ఆక్సైడ్‌
  • - నైట్రిక్‌ ఆక్సైడ్‌

కాలుష్యం హద్దుమీరితే వచ్చే సమస్యలు

  • రేణువులు(ఎన్‌సీఎం): శ్వాసకోశ సంబంధ వ్యాధులు
  • సల్ఫర్‌ డై ఆక్సైడ్‌: శ్వాసకోశాలకు చికాకు కలిగించి, బోంకటీస్‌కు దారితీసే అవకాశం
  • నైట్రోజన్‌-డై-ఆక్సైడ్‌: కళ్లు, ముక్కు మండటం, శ్వాసకోశాలకు తీవ్ర చికాకు
  • కార్బన్‌ మోనాక్సైడ్‌: శరీర జీవకణాలకు ఆక్సిజను లేకుండా చేస్తుంది. అపస్మారక స్థితి ఏర్పడుతుంది
  • హైడ్రోకార్బన్లు: కేంద్ర నరాల వ్యవస్థకు నష్టం కలిగిస్తాయి
  • క్లోరిన్‌: ఊపిరితిత్తులకు తీవ్రంగా మంట కలుగుతుంది. కళ్లు మంటపుడతాయి
  • హైడ్రోజన్‌ సల్ఫైడ్‌: శ్వాసకోశాలకు పక్షపాతం తక్షణమే మూర్చపోతాం
  • సీసం(లెడ్‌): మెదడు పాడైపోడం, కండరాల పక్షపాతం, అనారోగ్యం

నిబంధనలకనుగుణంగానే..

ఉభయ జిల్లాల్లో విషపూరిత వాయువులు విడుదల చేసే పరిశ్రమలు పెద్దగా లేవు. ఉన్న పరిశ్రమల నుంచి విడుదలయ్యే వాయువులన్నీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఉంటున్నాయి- రవిశంకర్‌, పీసీబీ ఈఈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.