ETV Bharat / state

విషవాయువు బాధితులతో కిక్కిరిసిన కేజీహెచ్‌

విషవాయువు బాధితులతో విశాఖ కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌) వార్డులు కిక్కిరిసిపోయాయి. ఒకేసారి వందల సంఖ్యలో బాధితులు రావడంతో వైద్యులు, సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కలెక్టర్‌, డీఎంహెచ్‌వో నుంచి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అర్జునకు ప్రమాదంపై సమాచారం అందింది. ఆయన హుటాహుటిన వైద్య నిపుణులను రప్పించారు.

KGH full of clowed with toxic gas victims
విషవాయువు బాధితులతో కిక్కిరిసిన కేజీహెచ్‌
author img

By

Published : May 8, 2020, 7:51 AM IST

విశాఖలోని కేజీహెచ్‌ బాధితులతో నిండిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరగడంతో.. తెల్లవారుజామున 5 గంటల నుంచి అత్యవసర విభాగానికి బాధితులు రావడం ప్రారంభమైంది. వచ్చినవారికి వైద్య సేవలందించారు. విషమంగా ఉన్నవారిని ఐఎండీ, ఐఆర్‌సీయూలకు తరలించారు. 300 మంది సీనియర్‌, జూనియర్‌ వైద్యులు బాధితులకు సేవలందించారు. మధ్యాహ్నం వరకు బాధితులు వస్తూనే ఉండటంతో కొంతమందిని ప్రైవేటు ఆసుపత్రులకు పంపారు.

44 మంది చిన్నారులు విలవిల
అస్వస్థతకు గురైన 44 మంది చిన్నారులను పిల్లల వార్డులో చేర్చారు. కానీ వారి తల్లిదండ్రులు మరోచోట చికిత్స పొందాల్సి రావడంతో పిల్లలు తల్లడిల్లిపోయారు. పిల్లలకు ఏమైందో అని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

పూర్తిగా కోలుకున్న తర్వాతే

కేజీహెచ్‌లో 193 మంది చికిత్స పొందుతున్నారు. ఉదయంతో పోలిస్తే ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగైంది. బాధితులకు మూత్రపిండాలు, కాలేయం తదితర అవయవాలపై విషవాయువు ప్రభావం ఏమన్నా ఉందా అని పరీక్షలు చేయబోతున్నాం. అవసరమైన వారికి శుక్రవారం స్కానింగ్‌ చేస్తాం. బాధితులు పూర్తిగా కోలుకున్నాకే ఇళ్లకు పంపుతాం.- డాక్టర్‌ జి.అర్జున, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.