ETV Bharat / state

KAMBAMPATI: మిజోరం గవర్నర్​గా కంభంపాటి హరిబాబు ప్రమాణస్వీకారం - మిజోరం గవర్నర్​గా కంభంపాటి హరిబాబు ప్రమాణస్వీకారం

మిజోరం 15వ గవర్నర్​గా కంభంపాటి హరిబాబు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్​లోని రాజ్​భవన్​లో జరిగిన కార్యక్రమంలో గువాహటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ జోథాన్ ఖుమా ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.

మిజోరం గవర్నర్​గా కంభంపాటి హరిబాబు ప్రమాణస్వీకారం

author img

By

Published : Jul 20, 2021, 2:23 AM IST

ఈశాన్య రాష్ట్రం మిజోరం 15వ గవర్నర్​గా కంభంపాటి హరిబాబు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్​లోని రాజ్​భవన్​లో జరిగిన కార్యక్రమంలో గువాహటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ జోథాన్ ఖుమా ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. వాస్తవానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుదాంసుదులియా ప్రమాణం చేయించాల్సి ఉంది.

అయితే ఆయన కుటుంబ సభ్యులు కరోనా బాధ పడుతున్న నేపథ్యంలో ఆబాధ్యతలను మిజోరం రాజధాని ఐజ్వాల్ ఉన్న న్యాయమూర్తి మైఖేల్ జోథాన్ ఖుమాకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో మిజోరం ముఖ్యమంత్రి జోరందంగా, మంత్రులు, అధికారులు, కంభంపాటి హరిబాబు సతీమణి జయశ్రీ, ఆయన కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

CM Jagan Polavaram Tour: ఏదో కట్టాం అన్నట్టు పునరావాస కాలనీలు ఉండొద్దు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.