వరద ఉద్ధృతికి శారదా నదిపై కాజ్‌వే కొట్టుకుపోవడంతో... విశాఖ జిల్లా దేవరాపల్లి వాసుల కష్టాలు వర్ణణాతీతంగా మరాయి. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రైవాడ జలాశయం గేట్లు ఎత్తి శారదా నదిలోకి నీటిని వదలడంతో... కాజ్ వే కొట్టుకుపోయింది. శారదా నది అవతల వైపు ఉన్న అనంతగిరి, హుకుంపేట మండలాలకు చెందిన దాదాపుగా 100 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
శారదా నదిపై తలపెట్టిన వంతెన ఆరేళ్లుగా అసంపూర్తిగా ఉంది. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించలేదు. ప్రతీ ఏటా వర్షాలకు కాజ్ వే కొట్టుకుపోవడం పరిపాటిగా మారింది. ఇక వేరే మార్గం లేక అసంపూర్తిగా ఉన్న వంతెన పైనుంచే ప్రమాదకర పరిస్థితుల్లోనే రైతులు, మహిళలు, గర్భిణులు, బాలింతలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణం పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద