రాష్ట్రంలో పాత్రికేయులను కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని విశాఖ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్కి విజ్ఞప్తి చేశారు. పాత్రికేయులందరికీ రూ.80 లక్షల బీమా సదుపాయం వర్తింపజేయాలని కోరింది. పాత్రికేయుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శ్రీనాధ్ వివరించారు. వృత్తి రీత్యా నైపుణ్యం పెంచుకోవాలనుకునే గ్రామీణ విలేకర్లు, ఇతర ప్రత్యేక అంశాలపై వార్తలు రాసే విలేకర్లకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోగస్ విలేకర్లను ఏరివేసేందుకు... నిర్ధిష్ట ప్రమాణాలను అక్రిడేషన్ల కోసం నిర్దేశించారని, అ ప్రక్రియ కొనసాగుతున్నందునే కొత్త అక్రిడేషన్లలో జాప్యం అనివార్యమవుతోందని వివరించారు.
ఇదీ చదవండి: