భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేపట్టిన లాంగ్‌మార్చ్ ప్రారంభమైంది. రాష్టంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పవన్ లాంగ్‌మార్చ్‌ను ప్రారంభించారు. ఈ లాంగ్‌మార్చ్ రామాటాకీస్, ఆశీల్‌మెట్ట జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీకి తెదేపా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ తరఫున సీనియర్ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఈ లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు, భవన నిర్మాణ కార్మికులు తరలివచ్చారు.
ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులపై జనసేన లాంగ్‌మార్చ్ - janasena long march started in vishaka
రాష్ట్రంలో ఇసుక కొరతపై జనసేనాని విశాఖలో తలపెట్టిన లాంగ్‌మార్చ్ మొదలైంది. పవన్ అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. పవన్ కల్యాణ్ తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి మార్చ్ ప్రారంభించారు.