నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జనసేన కార్యకర్తలు దీక్ష చేపట్టారు. తుపాను బీభత్సం వల్ల పంటలు నీట మునిగి సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవడంలో వైకాపా సర్కారు విఫలమైందని జనసేన కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35 వేల పరిహారం ప్రకటించి భరోసా కల్పించాలన్నారు.
పాయకరావుపేటలో
జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో బోడపాటి శివ దత్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు నిరాహారదీక్ష చేపట్టారు. రైతులను ఆదుకోకుంటే ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నర్సీపట్నంలో
నివర్ కారణంగా నష్టపోయిన రైతులందరికీ తక్షణమే ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ.... నర్సీపట్నంలో జనసేన నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట... నీటి పాలవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పార్టీ నాయకులు తెలిపారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: