ETV Bharat / state

Janasena Chief Pawan Kalyan Visit Rushi Konda: ఉత్తరాంధ్రపై వైసీపీ నేతల కన్ను.. రుషికొండలో అక్రమాలు లేకుంటే భయమెందుకు..?: పవన్‌ కల్యాణ్

Janasena Chief Pawan Kalyan Visit Rushi Konda: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడోవ విడత వారాహి యాత్ర ఆంక్షల మధ్య కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ రుషికొండను సందర్శించకూడదంటూ విశాఖ పోలీసులు ఆంక్షలు విధించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి, పవన్ కల్యాణ్ వాహన శ్రేణిని అడ్డుకున్నారు. దీంతో ఎందుకు తమ వాహనాలను ఆపారంటూ పవన్ కల్యాణ్ పోలీసులను పశ్నించడంతో అనుమతిచ్చారు.

Pawan_Kalyan_Warahi_Yatra_2023
Pawan_Kalyan_Warahi_Yatra_2023
author img

By

Published : Aug 11, 2023, 8:58 PM IST

Updated : Aug 11, 2023, 9:13 PM IST

Janasena Chief Pawan Kalyan Visit Rushi Konda: జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో చేపట్టిన 'వారాహి విజయ యాత్ర' అడుగడుగునా ఆంక్షల మధ్య కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ రుషికొండను సందర్శించకూడదంటూ విశాఖ పోలీసులు ఆంక్షలు విధించారు. జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతించబోమని హెచ్చరించారు. ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌ నుంచి పవన్‌ వాహనానికి మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులు.. రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్‌ కల్యాణ్ వెళ్లాలని సూచించారు. అనంతరం గీతం కళాశాల వద్ద పవన్‌ కల్యాణ్ మీడియాతో మాట్లాడాలని పోలీసులు ఆంక్షలు విధించారు.

Police restrictions on Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం నుంచి విశాఖలో వారాహి మూడో విడత యాత్రను ప్రారంభించారు. మొదటి రోజు హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న పవన్.. నేరుగా బస చేసే హోటల్‌కు వెళ్లారు. అనంతరం యాత్రలో అనుసరించాల్సిన వ్యూహాలపై, జనవాణి ద్వారా స్థానిక సమస్యలపై పార్టీ నాయకులు, ప్రజలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటలకు పవన్ యాత్రకు అనుమతిచ్చిన విశాఖ పోలీసులు.. పలు ఆంక్షలు విధించారు. మొదట నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో రావాలని ఆంక్షలు పెట్టారు. విమానాశ్రయం నుంచి పోర్టు రోడ్డులోనే రావాలని సూచించారు. ఎక్కడా కూడా రోడ్‌ షో నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు. పవన్ హూటల్ బయటకొచ్చి ఎటువంటి అభివాదాలు చేయవద్దని ఆంక్షలు విధించారు.

Janasena Chief Pawan Kalyan Visit Rushi Konda: ఉత్తరాంధ్రపై వైసీపీ నేతల కన్ను.. రుషికొండలో అక్రమాలు లేకుంటే భయమెందుకు..?: పవన్‌ కల్యాణ్

Pawan Kalyan Fire on CM Jagan in Visakhapatnam Meeting: జగన్ నాయకుడు కాదు.. వ్యాపారి.. ఎప్పుడూ డబ్బు పిచ్చే: పవన్ కల్యాణ్

Pawan should not visit Rushikonda: రెండవ రోజు (శుక్రవారం) పర్యటనలో పవన్ కల్యాణ్ రుషికొండను సందర్శించకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతించబోమని హెచ్చరించారు. ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌ నుంచి పవన్‌ వాహనానికి మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులు.. రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్‌ వెళ్లాలని సూచించారు. దీంతో పోలీసుల ఆంక్షలపై జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందని నినాదాలు చేశారు.

Pawan's convoy was stopped by the police: జోడుగుళ్లపాలెం చేరుకున్న పవన్‌ కల్యాణ్‌ వాహనాలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ రుషికొండ పర్యటనపై ఆంక్షలు విధించామని.. జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతించబోమని చెప్పారు. ఒక్క పవన్‌ వాహనానికి మాత్రమే తాము అనుమతిస్తామని తెలియజేశారు. దీంతో ఎందుకు తమ వాహనాలను ఆపారంటూ.. పవన్ కల్యాణ్ కారు దిగి వచ్చి పోలీసులతో మాట్లాడారు. చివరికి పోలీసులు అనుమతించడంతో రుషికొండలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పర్యటించారు. అనంతరం పవన్ తితిదే ఆలయం ముందున్న రుషికొండ నిర్మాణ గేట్ వద్దకు వెళ్లారు.

Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: విశాఖలో జనసేన వారాహి యాత్ర.. పోలీసుల ఆంక్షలు

Pawan fire on Cm jagan: పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ..''ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైసీపీ నేతల కళ్లు పడ్డాయి. వైసీపీ నేతల దోపిడీ గురించి ప్రజలందరికీ తెలియాలి. తుపాన్లు వచ్చినప్పుడు రుషికొండ కాపాడుతోంది. రుషికొండకు అన్ని అనుమతులూ వచ్చాయా..? ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. జగన్‌కు ఎన్ని ఇళ్లు కావాలి..? తెలంగాణనూ ఇలాగే దోపిడీ చేశారు.. అందుకే తన్ని తగిలేశారు. రుషికొండ సందర్శన అంటే ఎందుకు భయపడుతున్నారు..? రుషికొండలో ఎలాంటి అక్రమాలు లేకుంటే ఎందుకు భయం..?'' పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan criticizes three capitals: అనంతరం రుషికొండలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను రక్షించాల్సిన పాలకులే.. చట్టాలు ఉల్లంఘిస్తున్నారని వ్యాఖ్యానించారు. రుషికొండను దశాబ్దాలుగా కాపాడుకున్నామన్న పవన్‌ కల్యాణ్‌.. ఒక రాజధానికే దిక్కు లేదు గానీ 3 రాజధానులు కడతారట అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి వారిని పాలకులుగా ఎన్నుకుంటే అంతా దోపిడీ చేస్తారని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు.

Pawan Kalyan: వైసీపీ దోపిడిని అడ్డుకోవటమే ప్రధాన లక్ష్యం.. జనసేన నేతలకు పవన్​ సూచన

Last Updated : Aug 11, 2023, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.