పేదలను దోచుకునే పార్టీ వైకాపా అయితే... పేదలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యనించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న బాబు... జగన్, కేసీఆర్‌ది మోదీ పక్షమని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని మోసం చేసిన మోదీ కూటమికి ఓటేస్తారా అని ప్రజల్ని ప్రశ్నించారు. వారికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచేస్తారని విమర్శించారు. పాయకరావుపేటను అన్ని విధాలా అభివృద్ధి చేశామని వ్
యాఖ్యానించారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలిచి అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి
మోదీకి బాబు సవాల్! ఎవరేమి చేశారో చర్చకు సిద్ధమా?