విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం నుంచి ఆయకట్టు ప్రాంతంలో రబీ, ఆరుతడి పంటల సాగుకు నీటిని విడుదల చేశారు. ఎగువ కాలువకు 40 క్యూసెక్కులు, దిగువ కాలువకు 10 క్యూసెక్కుల చొప్పున అధికారులు సాగునీటి విడుదల చేస్తున్నారు.
విడుదల చేస్తున్న నీటిని రబీ పంటలతోపాటు సాగునీటి చెరువులకు రైతులు మళ్లించుకుంటున్నారు. జలాశయంలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో.. ఈ ఏడాది వేసవిలో నీటికి ఇబ్బందులు ఉండవని ఆయకట్టు రైతులు భావిస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా.. ప్రస్తుతం 96.5 మీటర్ల మేరకు జలాశయంలో నీరు అందుబాటులో ఉందని ఏఈ రామారావు తెలిపారు.
ఇదీ చదవండి: ఎంతపెద్ద ముల్లంగి దుంపలో..!