ఈనెల 15న ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా అంతర్జాలం ద్వారా సాహిత్య సమ్మేళనాన్ని నిర్వహించనుంది. అడవివరం గ్రామానికి చెందిన నవల రచయిత ఇందు రమణకు ఆహ్వానం అందింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో... ప్రపంచవ్యాప్తంగా 74 మందికి సాహితీవేత్తలతో ఈ సమ్మేళనాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు ఇందు రమణ కృతజ్ఞతలు తెలిపారు.