ETV Bharat / state

'డాక్టర్ సుధాకర్​పై మరోసారి విచారణ.. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం' - interrogation on Dr Sudhakar at Narsipatnam

ప్రాంతీయ ఆస్పత్రుల జిల్లా సమన్వయకర్త, డీసీహెచ్ డాక్టర్ లక్ష్మణ్ రావు నేతృత్వంలో మరోసారి నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్​పై విచారణ చేపట్టారు. శాఖాపరమైన విచారణ నిర్వహించాలని డీసీహెచ్ లక్ష్మణ్ రావును ప్రభుత్వం నియమించింది.

interrogation on Dr Sudhakar
డాక్టర్ సుధాకర్​పై మరోసారి విచారణ.
author img

By

Published : Dec 29, 2020, 10:52 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్​పై మరోసారి విచారణ కొనసాగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాంతీయ ఆస్పత్రుల జిల్లా సమన్వయకర్త, డీసీహెచ్ డాక్టర్ లక్ష్మణ్ రావు నేతృత్వంలో సుధాకర్​ను విచారించారు. సుధాకర్​పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి శాఖాపరమైన విచారణ నిర్వహించామని.. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని విచారణాధికారి డాక్టర్ లక్ష్మణ్ రావు తెలిపారు.

నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్... గతంలో ప్రభుత్వంపై విమర్శలు చేసినట్లు అధికారులు భావించారు. దీంతో సుధాకర్​ను సస్పెండ్ చేసి కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఇదీచదవండి

కరోనా వ్యాప్తి తగ్గుముఖం- కొత్తగా 16,432 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.