విశాఖలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ సమావేశం - lates news of avathi srinivas
విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్... వైశ్యుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం, సంఘ భవన ప్రారంభం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఏపీ ఐవీఎఫ్ నూతన అధ్యక్షుడిగా కే.నాగబాబు, కార్యదర్శిగా డాక్టర్ పీ. విశ్వేశ్వరరావు ఎన్నికయ్యారు. 26 రాష్ట్రాలకు చెందిన ఐవీఎఫ్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.