స్టాక్ మార్కెట్ జాబితాలో 2021-22 సంవత్సరంలో ఎల్ఐసీని చేర్చటంపై ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి సి.ఎన్. రమణాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచాలని, 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేట్ పరం చేయాలని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించటాన్ని వ్యతిరేకించారు. ప్రజలకు, దేశానికి ఎల్ఐసీ ఎంత అవసరమో తెలియజేస్తూ.. పోరాటం చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో... 'వాల్తేరు' అనుబంధం తెలుసా..?