విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూపార్క్‌లో 17 రోజుల క్రితం జన్మించిన ఓ జిరాఫీ కూన మృతి చెందింది. ఈ జిరాఫీ కూన నెలలు నిండకుండానే జన్మించినప్పటికి... చలాకీగానే ఉండేదని అటవీ అధికారులు చెబుతున్నారు. తల్లి జిరాఫీకి పాలు లేకపోవడం వల్ల అవు పాలు పట్టించారు. వేరే ఆహారం అందించాలని యత్నించినా తీసుకోకపోవడంతోపాటు తల్లి జిరాఫీ దగ్గరకు రానివ్వకపోవడంతో పరిస్ధితి విషమించి చిన్ని జిరాఫీ కన్నుమూసిందని జూ క్యూరేటర్ యశోదాబాయి వెల్లడించారు.
ఇది చూడండి: కాలువలో పడిన చిన్నారి.. దొరకని ఆచూకీ