భారత నౌకాదళం మరో తాజా ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలకు సముద్ర తీరం విస్తరించి, నౌకావాణిజ్య కేంద్రాలుగా ఎదిగిన అంశాలను ఇందులో పరిచయం చేసింది. నౌకాయానం సురక్షితంగా జరిగినపుడే దేశ పురోగతిలో ఆదాయం నమోదు చేస్తోందని వివరించింది. 60 శాతం జీడీపీ నౌకావాణిజ్యం ద్వారా వస్తోందని.. 20 శాతం దేశ జనాభా ఈ కార్యకలాపాలతో సంబంధం ఉందని జత చేసింది. వాతావరణ మార్పుల్లోనూ, వరదలు, తుపానులు వంటి సమయాల్లో నౌకా దళం మానవీయ సాయాన్ని అందించడంలో చురుకైన పాత్ర పోషిస్తోందని తెలిపింది. విక్రాంత్ లాంటి భారీ నౌకల నిర్మాణాలు, జలాంతర్గాముల నిర్మాణాలు మేకిన్ ఇండియాలో భాగంగా తయారైనవిగా ఈ ప్రచార చిత్రంలో వెల్లడించింది. ఎటువంటి సవాళ్లను, ముప్పులను ఎదుర్కోవడానికైనా నౌకాదళం సర్వసన్నద్దంగా ఉంటుందని ఇందులో వివరించింది.
ఇదీ చదవండి: