ETV Bharat / state

India skills 2021: విశాఖ వేదికగా.. దక్షిణ భారత నైపుణ్య పోటీలు

India skills 2021: విశాఖలోని ఆంధ్రవర్సిటీలో దక్షిణ భారత రాష్ట్రల నైపుణ్య పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను.. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బుధవారం ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసే ఆలోచనలతో రాష్ట్రం ముందడుగు వేస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారులు ఈ కార్యక్రమంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. దక్షిణ భారత రాష్ట్రాల యువతీయువకులు, నైపుణ్య పోటీదారులంతా ఇప్పటికే విజేతలయ్యారని, త్వరలో నైపుణ్యం, అంకితభావం, పోరాట పటిమతో జగజ్జేతలుగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.

India skills 2021
India skills 2021
author img

By

Published : Dec 2, 2021, 7:31 AM IST

దక్షిణభారత నైపుణ్యపోటీలు

India skills 2021: దక్షిణ భారత నైపుణ్య పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం విశాఖలోని ఏయూ కన్వెన్షన్‌ కేంద్రంలో బుధవారం ఘనంగా జరిగింది. ఐ.టి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి గౌతంరెడ్డి ఆయా పోటీలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి యువత పాల్గొనగా మరికొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ట్రాక్‌-2, 3 కేటగిరీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ప్రాంగణం బయట థింసా నృత్యం ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు వేదిక ముందు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు.

2019లో రష్యాలో జరిగిన పోటీల్లో ‘మెడలియన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ’ అవార్డు పొందిన తెలంగాణకు చెందిన కోటేశ్వరరెడ్డి కార్యక్రమానికి వచ్చిన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ‘అంకితభావంతో పోటీల్లో పాల్గొంటానని, మోసం చేయనని, మంచి ప్రతిభ కనబరుస్తానని, మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తా’నని పోటీలకు హాజరైనవారు ప్రతిజ్ఞ చేశారు. వారికి నగరంలోని 11 కేంద్రాల్లో, 52 విభాగాల్లో పోటీలు నిర్వహించి ఈనెల నాలుగో తేదీన విజేతలకు బహుమతులు అందజేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ యువతతో మంత్రి గౌతంరెడ్డి

minister gowtham reddy on india skills: విశాఖపట్నంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. విశాఖపట్నం అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. హైటెక్‌ స్కిల్‌ యూనివర్సిటీ విశాఖలో, మోడరేట్‌ స్కిల్లింగ్‌ వర్సిటీ తిరుపతిలో పెట్టనున్నామన్నారు. ఎవరైనా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేస్తే 26 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తామని తెలిపారు. కొంతమంది భూములు తీసుకొని పరిశ్రమలు నెలకొల్పకపోవడం వలనే పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు.

ఇదీ చదవండి:

APSFSC Explanation to RBI about loans : 'డిపాజిట్లు స్వీకరించి రుణంగా ఇస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.