విశాఖ పాడేరు మన్యంలో అధికారులు కరోనా కట్టడిలో విఫలం అవుతున్నారు. ముందస్తు చర్యలు ఎక్కడ కానరాలేదు రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు జాడలేదు. గత పది రోజులుగా కరోనా చాపకింద నీరులా ప్రవహిస్తోంది. విశాఖ కేంద్రం పాడేరులో ప్రతి వీధిలోని ఈ ఛాయలు కనిపిస్తాయి ముఖ్యంగా పాడేరు ఐటీడీఏ కాలనీ, రేకులు కాలనీ, లోచలిపుట్టు కరోనా కేసులు ఎక్కువయ్యాయి. స్థానికులు భయాందోళన చెందడంతో అధికారులు పూర్తి స్థాయిలో లెక్కలు చెప్పడం లేదు.
కరోనా లక్షణాలతో ఆసుపత్రులకు కొవిడ్ సెంటర్‌కి వెళ్తున్నా కరోనా నిర్ధారిత కిట్లు లేవంటూ వెనక్కి పంపిస్తున్నారు. కరోనా బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లు సకాలంలో రావటం లేదు. పాడేరులో బుధవారం నుంచి వ్యాపారులు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. 250కి పైగా కేసులు, ఇద్దరు మృతి చెందడంతో మన్యం గజగజ వణుకుతోంది. అధికారులను గట్టిగా ప్రశ్నించగా పాడేరు రేకుల కాలనీలో శానిటేషన్ చేశారు. కరోనా వచ్చిన ప్రాంతాల్లో కాంటాక్ట్ వివరాలు సేకరించడం లేదు. రెవెన్యూ, పంచాయతీ రాజ్ మండల పరిషత్ అధికారులు, పోలీసులు ముందస్తు కార్యాచరణ పనులు కానరావడం లేదు.
ఇవీ చదవండి