విశాఖ జిల్లాలో ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైంది. ఈ మేరకు మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో 36 లక్షల 25 వేల 381 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 17 లక్షల 96 వేల 185, మహిళలు 18 లక్షల 28 వేల 986 మంది కాగా... థర్డ్ జెండర్ రెండు వందల మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు అనంతరం వచ్చే జనవరి 15న తుది జాబితా ప్రకటిస్తారు. గత ఏడాది జాబితాలో సవరణలు చేసి ఈ ఏడాది జనవరి 15న తుది జాబితా విడుదల చేశారు.
ఈ ప్రకారం జిల్లాలో 36 లక్షల 4 వేల 831 మంది ఓటర్లు ఉన్నారు. అప్పటి జాబితాతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 20 వేల 550 మంది ఓటర్లు పెరిగారు. విశాఖ జిల్లాలోని 15 సెగ్మెంట్లలో 13 చోట్ల ఓటర్లు పెరగ్గా... రెండు చోట్ల ఓటర్లు తగ్గారు. అత్యధికంగా భీమిలిలో 6572 మంది ఓటర్లు పెరిగారు. విశాఖ తూర్పు ,పెందుర్తి నియోజకవర్గాల్లో స్వల్పంగా తగ్గారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పెరుగుదల నామమాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖ జిల్లాలో ఓటర్ల సెగ్మెంట్ల వారీగా ఇలా ఉన్నాయి.
నియోజకవర్గం | 2020 | 2021 |
భీమిలి | 310357 | 316929 |
విశాఖ తూర్పు | 273092 | 271725 |
విశాఖ దక్షిణ | 214330 | 215422 |
విశాఖ ఉత్తరం | 278418 | 282438 |
విశాఖ పశ్చిమ | 233127 | 236309 |
గాజువాక | 314611 | 317510 |
చోడవరం | 211596 | 212063 |
మాడుగుల | 187324 | 188490 |
అరకు | 221935 | 221968 |
పాడేరు | 227999 | 228136 |
అనకాపల్లి | 208028 | 209033 |
పెందుర్తి | 269839 | 268612 |
యలమంచిలి | 200480 | 201058 |
పాయకరావుపేట | 242945 | 244226 |
నర్సీపట్నం | 210750 | 211471 |
మొత్తం | 3604831 | 3625381 |
ఇదీ చదవండి: