విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఆదివారం జరగనున్న ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తెలనుంది. నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ పీఠాన్ని ఎస్సీ మహిళకు కేటాయించగా.. ప్రముఖ పార్టీలు తమ అభ్యర్థులు రంగంలో దించాయి.
ఈ పురపాలక పరిధిలోని 28 వార్డులలో 2 , 8 , 9 ,11 , 13 ,14 16 , 25 ,26 , 27 వార్డులలో త్రిముఖ పోటీ ఉంచారు. ఇక మిగిలిన 3 ,6 ,10 , 12 వార్డులలో చతుర్ముఖ పోటీ, 15 వార్డులో పంచముఖ పోటీ ఏర్పడింది. ఇందుకు తగ్గట్టుగా ప్రధాన పార్టీల నాయకులు కార్యకర్తలు బూతులవారీగా పోలైన ఓట్ల వివరాలు సమీక్షిస్తున్నారు. తమకు అనుకూలంగా పోలైనవి.. ప్రత్యర్థికి పడేవి.. తటస్థులకు పడే ఓట్లు.. బేరీజు వేస్తున్నారు. బ్యాలెట్ పెట్టెలను నర్సీపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కి తరలించి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: