ETV Bharat / state

Bio mining: డంపింగ్ యార్డుల్లో బయోమైనింగ్ విధానం.. చెత్తశుద్ధికి ముందడుగు - బయోమైనింగ్ విధానం

పురపాలికల్లోని డంపింగ్‌యార్డుల్లో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను.. బయోమైనింగ్‌ విధానం ద్వారా శుద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3 నగరాల్లో బయోమైనింగ్‌ జరుగుతుండగా.. గుంటూరు, కర్నూలు, తెనాలిలో ఈ కార్యక్రమాన్ని అమలుపరచనున్నారు. ఈ విధానంలో చెత్త నుంచి మళ్లీ ఉపయోగించేందుకు అవసరమైన వస్తువులను వెలికితీయనున్నారు. బయోమైనింగ్ ద్వారా ఖాళీ అవుతున్న డంపింగ్‌ యార్డుల్లో పార్కులను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

డంపింగ్ యార్డుల్లో బయోమైనింగ్ విధానం... చెత్తశుద్ధికి ముందడుగు
డంపింగ్ యార్డుల్లో బయోమైనింగ్ విధానం... చెత్తశుద్ధికి ముందడుగు
author img

By

Published : Aug 11, 2021, 5:27 PM IST

పురపాలికల్లోని డంపింగ్‌యార్డుల్లో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను.. బయోమైనింగ్‌ విధానం ద్వారా శుద్ధి చేస్తున్నారు. చెత్త నుంచి మళ్లీ ఉపయోగించేందుకు అవసరమైన వస్తువులను వేరు చేస్తున్నారు. విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈ ప్రక్రియ పూర్తవగా.. 12.5లక్షల టన్నుల నిల్వలున్న విశాఖలో వేగంగా కొనసాగుతోంది. బయోమైనింగ్ విధానం ద్వారా విశాఖ సమీపంలోని కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులో చెత్త తరిగిపోతోంది. గతేడాది తొలివిడతగా రూ.22.50కోట్లతో 2.5లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ప్రస్తుతం 1.4లక్షల టన్నుల చెత్తను తరలించారు. ఫలితంగా మరో రూ.38.30కోట్లతో 4.5లక్షల టన్నుల చెత్తను తొలగించాలని జీవీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. విజయవాడలోని అజిత్​సింగ్ నగర్​లో 2020 జులై నాటికి 45ఎకరాల్లో 3.05లక్షల టన్నుల చెత్తను తొలగించగా... తిరుపతిలోని సి.రామాపురంలో 2021ఏప్రిల్ నాటికి 2.17లక్షల టన్నుల ప్రాజెక్టు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.

అవసరమైన వారికి ఉచితంగా...

రాష్ట్రంలోనే అతిపెద్దదైన విశాఖ యార్డులో ఇప్పటివరకు బయోమైనింగ్ విధానంలో అనేక రకాల వస్తువులను వెలికితీశారు. వీటిలో మట్టి 62-68శాతం, రాళ్లు 17-24శాతం, ఇతర వస్తువులు 12-16శాతంగా ఉన్నాయి. చెత్త నుంచి వెలికితీసిన వస్తువులను అవసరమున్న వారికి ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3 నగరాల్లో బయోమైనింగ్‌ జరుగుతుండగా.. గుంటూరు, కర్నూలు, తెనాలిలో ఈ కార్యక్రమాన్ని అమలుపరచనున్నారు. ఇవిగాక అమృత్ పథకంలో ఎంపికైన మిగతా 26 పురపాలికల్లోని యార్డుల్లో 45లక్షల టన్నుల చెత్త పేరుకున్నట్లు డ్రోన్‌ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. బయోమైనింగ్‌ ద్వారా వీటిని తొలగించేందుకు రూ.400కోట్లు అవసరమవుతాయని ప్రణాళికలు రూపొందించారు. లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న మరో 91 పురపాలికల్లోని డంపింగ్‌ యార్డుల్లో నిల్వ ఉన్న చెత్తపై అధికారులు డ్రోన్‌ సర్వే చేపడుతున్నారు. వీటన్నింటినీ 2023కు ముందే ఖాళీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.

పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు..

ప్రస్తుతం రాష్ట్రంలోని డంపింగ్‌ యార్డుల్లో ఏళ్లుగా చెత్త పేరుకుంది. వీటినుంచి ప్రమాదకర ద్రవాలు భూమిలోకి ఇంకిపోవడంతో చెత్త తొలగించాక.. ఆ భూమి నివాసయోగ్యంగా మారడానికి 10-15ఏళ్ల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఫలితంగా బయోమైనింగ్‌ ద్వారా ఖాళీ అవుతున్న డంపింగ్‌ యార్డుల్లో పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. విజయవాడ, తిరుపతిలో పార్కులు కట్టేలా ప్రణాళికలు చేపడుతుండగా... విశాఖలో సుమారు 14 ఎకరాల్లో రూ.12.63కోట్ల రూపాయలతో వినూత్న పార్కును నిర్మించనున్నారు.

ఇవీచదవండి.

వివేకా హత్య కేసులో దోషులను త్వరగా తేల్చండి: నారాయణ

viveka murder case: వివేక హత్య కేసు.. కర్ణాటక నుంచి 20 వాహనాల్లో వచ్చిన అధికారులు

వెంకయ్య తీవ్ర భావోద్వేగం- ఎంపీల తీరుపై ఆవేదన

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.