ETV Bharat / state

కుటుంబ కలహాలతో.. భార్యపై భర్త యాసిడ్‌ దాడి - visakha district latest news

విశాఖ జిల్లా శివాజీపాలెంలో ఓ వ్యక్తి.. అతని భార్యపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కుమార్తెపైనా యాసిడ్​ పడి గాయపడింది.

mother and daughter injured in acid attack
యాసిడ్​ దాడిలో గాయపడిన తల్లీ, కూతురు
author img

By

Published : Oct 31, 2020, 11:20 AM IST

Updated : Oct 31, 2020, 7:48 PM IST

భార్యపై భర్త యాసిడ్​ దాడి చేశాడు. అడ్డువచ్చిన కుమార్తెపై యాసిడ్​ పడింది. అనంతరం తప్పించుకునేందుకు ప్రయత్నించిన భర్త పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన విశాఖ శివాజీపాలెంలో జరిగింది. ఈ ఘటనలో భార్యతో పాటుగా.. ఆమె 12 ఏళ్ల కూతురు గాయపడింది. అనంతరం భర్త ఈశ్వరరావు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ దాడికి పాల్పడినట్లు ఈశ్వరరావు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికులు బాధితులిద్దరినీ కేజీహెచ్​కు తరలించారు. బాత్​రూంలో వినియోగించే తక్కువ గాఢత కలిగిన యాసిడ్​ కావడంతో వీరికి స్వల్ప గాయాలయ్యాయి.

ఇదీ చదవండి:

ఏడేళ్ల బాలుడ్ని మింగేసిన క్వారీ గుంత

Last Updated : Oct 31, 2020, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.