విశాఖ నగరంలో 'ఈనాడు' మెగా ప్రాపర్టీ షో-2019 నిర్వహిస్తోంది. స్థిరాస్తి రంగానికి సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. బీచ్ రోడ్డులోని గాదిరాజు ప్యాలెస్లో ఏర్పాటు చేసిన మెగా ప్రాపర్టీ షో... కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. 60కి పైగా స్థిరాస్తి సంస్థలు ప్రాపర్టీ షోలో పాల్గొన్నాయి. నిర్మాణ రంగంతోపాటు నివాసస్థలాలకు సంబంధించిన అనేక ప్రాజెక్టులను సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు.
చిన్న, మధ్య, ఎగువ తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే దిశగా స్థిరాస్తి సంస్థలు ప్రత్యేక ఆఫర్లతో ముందుకొచ్చాయి. ప్లాట్లు, విల్లాలు, నిర్మాణ సామగ్రి, ఇంటీరియర్ డెకరేషన్ ఉత్పత్తులు, బ్యాంకింగ్ సదుపాయాలు ఇలా అన్ని రకాల స్టాల్స్ ప్రదర్శించారు. నేటితో 'ఈనాడు' మెగా ప్రాపర్టీ షో ముగిసింది. ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఈ ప్రదర్శనకు ఉచిత ప్రవేశాన్ని కల్పించడంతో పాటు... సందర్శకులకు లక్కీ డ్రా ప్రత్యేక బహుమతులు అందించారు.
ఇదీ చదవండి: 'ఈనాడు' ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీ షో