Huge Arrangements For Nara Lokesh Yuvagalam Closing Meeting: యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ కు ఈ నెల 20వ తేదీన జయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లి వద్ద ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. బహిరంగ సభకు 110 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దాదాపు 5-6లక్షల మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 50వేల మంది కూర్చుని బహిరంగ సభ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
అన్ని వైపులా భోజన సదుపాయం జైత్రయాత్ర విజయోత్సవ సభ నిర్వహణకు కోసం ఇప్పటికే 16కమిటీలు ఏర్పాటు చేశారు. స్టేజీ మొత్తం 200అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 8అడుగుల ఎత్తు లో నిర్మించారు. స్టేజీపై 600మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. స్టేజీ వెనుక 50 అడుగుల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఎల్లుండి ఉదయం ప్రత్యేక రైళ్లలో అభిమానులు విజయనగరం చేరుకోనున్నారు. పార్కింగ్ కోసం ఉత్తరాంధ్ర వైపు 2 పార్కింగ్ స్థలాలు, విశాఖ వైపు 2 పార్కింగ్ స్థలాలు, ఒక్కో పార్కింగ్ స్థలం 50ఎకరాల్లో ఏర్పాటు చేశారు. భోగాపురం వచ్చే అన్ని వైపులా భోజన సదుపాయం కల్పించారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు బహిరంగ సభ జరగనుందని నిర్వాహకులు తెలిపారు.
పోలేపల్లిలో యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ - హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
అనుమతులలు ఇవ్వకుండా ఇబ్బందులు: యువగళం పాదయాత్ర ముగింపు సభ కోసం ప్రభుత్వం అనుమతులలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తొలుత అంధ్రవిశ్వవిద్యాలయం మైదానంలో అనుమతి అడిగామని, ఇస్తామంటూనే పై నుంచి వత్తిడితో నిరాకరించారన్నారు. విజయనగరం జిల్లా పొలిపల్లి వద్ద ప్రయివేటు లేఅవుట్ లో బహిరంగ సభ అనుమతి కోసం ఎస్పీకి దరఖాస్తు చేశామన్నారు. దాదాపు 120 ఎకరాల్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని అచ్చెన్నాయుడు చెప్పారు. మా బహిరంగ సభకు వచ్చేందుకు ప్రయివేటు బస్సులు ఏర్పాటు చేసుకుంటే అనుమతులు ఇవ్వడం లేదని, ఆర్టీఏల నుంచి వారిని బెదిరిస్తున్నారన్నారు. ఆర్టీసీ బస్సులు కేటాయించడం లేదని, దీనికి పలు కారణాలు అధికార్లుచెబుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజలు సొంత వాహనాల్లో పెద్ద ఎత్తున వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని చెప్పారు.
కోలాహలంగా యువగళం పాదయాత్ర - లోకేశ్ వెంట నడిచిన భువనేశ్వరి, కుటుంబ సభ్యులు
మెుత్తం 97 నియోజకవర్గాల్లో: లోకేశ్ యువగళం కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైంది. మెుత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజులపాటు యువగళం పాదయాత్ర కొనసాగింది. యువగళం పాదయాత్రలో భాగంగా 3,132 కిలోమీటర్ల మేర లోకేశ్ నడిచారు. అన్ని జిల్లాల్లో ప్రజలు యువగళం పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఎల్లుండి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభ ద్వారా పాదయాత్ర ముగించనున్నారు.
ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ - ఉత్సాహంగా కదులుతోన్న లోకేశ్ యువగళం