కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. నాలుగో విడత చేపట్టిన సర్వేలో భాగంగా గ్రామంలోని 24 వేల ఇళ్లకు వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిని యాప్లో నమోదు చేస్తున్నారు. అనుమానం ఉన్న వారికి కొవిడ్ పరీక్షలు చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో ఉన్న లక్ష మంది ఆరోగ్య వివరాలు సేకరించేలా ఈ నెల 24వ తేదీ వరకు సర్వే చేపడుతున్నట్లు జీవీఎంసీ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి.. స్విగ్గీ భాగస్వామ్యంతో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు