ETV Bharat / state

పేదరికంలో ఉన్నా.. నిజాయితీ చాటుకున్న దంపతులు

ఆర్థికంగా పేదవారైనా నిజాయితీలో మాత్రం కోటేశ్వరులని నిరూపించారు ఆటో డ్రైవర్‌ దంపతులు. తమకు దొరికిన బంగారు ఆభరణాన్ని పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు.

honest couple in payakaraopeta at visakhapatnam
నిజాయితీ చాటుకున్న పేద దంపతులు
author img

By

Published : Feb 13, 2020, 7:34 AM IST

Updated : Feb 13, 2020, 8:25 AM IST

నిజాయితీ చాటుకున్న దంపతులు

లక్షలు విలువ చేసే దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు ఓ ఆటో డ్రైవర్ దంపతులు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి కథనం ప్రకారం.. పాయకరావుపేటకు చెందిన కర్రి వీరబాబు, కిరణ్మయి రూ. 2 లక్షల విలువైన బంగారు నక్లెస్‌ను బాగు చేయించడానికి సోమవారం తునిలో దుకాణానికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో పడిపోయింది. దీనికోసం వెతికినప్పటకీ ఫలితం లేక పాయకరావుపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తునికి చెందిన తుమ్మి విజయబాబు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సాయంత్రం పాయకరావుపేట నుంచి తుని వెళుతుండగా.. రోడ్డుపక్కన ఇసుకలో పర్స్‌ కనిపించింది. తీరా చూస్తే నక్లెస్‌ కనిపించింది. ఈ విషయాన్ని భార్య లోవకుమారికి తెలియపరచగా పోలీసుస్టేషన్‌కు అప్పగించాలని సూచించింది. ఆయన ఆ వస్తువును ఎస్సై విభీషణరావుకి అప్పగించాడు. వెంటనే ఎస్‌ఐ ఏఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఆ వస్తువును యజమానికి అప్పగించి, నిజాయతీ చాటుకున్న దంపతులిద్దరినీ సత్కరించారు.

ఇదీ చదవండి: విశాఖలో కరోనా వైరస్ నివారణ బృందం పర్యటన

Last Updated : Feb 13, 2020, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.