కరోనా ప్రభావం విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ కార్యాలయాలపై పడింది. అక్కడ విధులు నిర్వహిస్తోన్న సిబ్బందికి కొవిడ్ లక్షణాలు బయటపడుతుండటంతో కార్యాలయాలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా దస్తావేజు లేఖరికి కరోనా సోకటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సోమవారం నుంచి ఆగస్టు 2 వరకు మూసివేస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. రెవెన్యూ కార్యాలయంలోనూ ఓ ఉద్యోగికి కొవిడ్ లక్షణాలు కనిపించడంతో కార్యాలయానికి ఎవరూ రావద్దని చోడవరం తహసీల్దార్ రవికుమార్ నోటీస్‌లో పేర్కొన్నారు.
న్యాయ స్థానాల్లో పనిచేసే సిబ్బందిలో ఎనిమిది మందికి వైరస్ సోకటంతో కార్యకలాపాలు నిలిపివేశారు. పోలీసు స్టేషన్లో ఇద్దరు పోలీసులు, హోమ్ గార్డుకు కరోనా సోకింది. దీనికి తోడు వృద్ధులైన ముగ్గురు సిబ్బందిని ఇంటికే పరిమితం చేశారు. కరోనా పాజిటివ్ లక్షణాలు కలిగిన సిబ్బందితో సన్నిహితంగా ఉన్న ఐదుగురు హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇలా కరోనా దెబ్బతో... సిబ్బంది లేక పనులు సాగక ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి.
ఇవీ చదవండి...