విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. పొని తుపాను ప్రభావం వలన ఇప్పటికే పలు రైళ్ల రద్దు కొనసాగుతుండటంతో పాటు... మరికొన్నింటి గమ్యస్థానాలను కుదించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అరకొర రాకపోకలు సాగిస్తున్నా.. పలు రైళ్లి కిక్కిరిసి పోతున్నాయి.
చెన్నై నుంచి హౌరా వెళ్లేందుకు విశాఖపట్నం వచ్చిన కోరమండల్ ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ బోగీలూ...కిక్కిరిసి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
చేతిలో టికెట్ ఉన్నా రైలులో సీటులేదు...!
చేతిలో కన్ఫామ్ టికెట్లు ఉన్నప్పటికీ కూడా రైలు ఎక్కే అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు ప్లాట్ ఫాం పై గడపాల్సి వచ్చింది. ప్రయాణికుల రద్దీని ఆసరాగా తీసుకున్న పలువురు టిక్కెట్ తనిఖీ అధికారులు అపరాధ రుసుము విధించి రిజర్వేషన్ బోగిలలో వారు ఎక్కేందుకు అనుమతించారు. దీంతో రైళ్లు మరింతగా కిక్కిరిసిపోయాయి. రిజర్వేషన్ టిక్కెట్లు ఉన్నవారు రైలు ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న ఆర్పిఎఫ్ పోలీసులు విశాఖ రైల్వేస్టేషన్లో ఆ బోగీలు ఖాళీ చేయించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో పలువురు ప్రయాణీకులు రైలు ఎక్కలేక స్టేషన్లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విశాఖ రైల్వేస్టేషన్లో కిక్కిరిసిన రైళ్లు - hevy_rush_at-vishaka railway station
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. పొని తుపాను ప్రభావం వలన ఇప్పటికే పలు రైళ్ల రద్దు కొనసాగుతుండటంతో పాటు... మరికొన్నింటి గమ్యస్థానాలను కుదించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అరకొర రాకపోకలు సాగిస్తున్నా.. పలు రైళ్లి కిక్కిరిసి పోతున్నాయి.
![విశాఖ రైల్వేస్టేషన్లో కిక్కిరిసిన రైళ్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3219179-699-3219179-1557265271818.jpg?imwidth=3840)