విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలకు దాతలు ఉదారంగా సహాయం అందించారు. స్థానిక వ్యక్తి నాగరాజు వీరందరికీ నెలకు సరిపడా నిత్యావసర సరకులు అందించారు. బియ్యం, పప్పులు ఇలా 18 రకాల వస్తువులు ఉచితంగా అందించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా పేద కార్మికుల జాబితాను రప్పించుకున్నారు. అన్నీ ఒక సంచిలో వేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
ఇదీ చదవండి: జులై 8న 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు: సీఎం