ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీటి మట్టం చేరి కనువిందు చేస్తున్నాయి. నర్సీపట్నం డివిజన్లో నాతవరం మండలం తాండవ జలాశయంతో పాటు రావికమతం మండలం కళ్యాణం లోవ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. తాండవ రిజర్వాయర్ సంబంధించి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో సుమారు 52 వేల ఎకరాలకు నీరు అందిస్తోంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా నీటి మట్టం 376 అడుగుల వద్ద నిలకడగా ఉంది.
- కళ్యాణపు లోవ జలాశయం
రావికమతం మండలం కళ్యాణపు లోవ జలాశయం సంబంధించి రావికమతం రోలుగుంట మాకవరపాలెం మండలాల్లో సుమారు ఐదు వేల ఐదు వందల ఎకరాలకు నీరు అందిస్తోంది, దీని పూర్తి స్థాయి నీటిమట్టం నాలుగు వందల అరవై అడుగులు కాగా ప్రస్తుతం 454 అడుగుల వద్ద నీటిని నిలకడగా ఉంచుతున్నారు. ఈ జలాశయం పరిధిలో 10 మి.మీ వర్షపాత నమోదు కాగా సగటున 60 క్యూసెక్కుల నీరు బయటకు విడుదల చేస్తున్నారు. వాతావరణం ఇలా అనుకూలంగా కొనసాగితే అటు ఖరిఫ్ సీజన్ ఆశాజనకంగా పూర్తవడంతో పాటు జలాశయాలు నిండుకుండలా ఉంటాయని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు
ఇవీ చదవండి