ETV Bharat / state

రోడ్డుకు అడ్డుగా నిలిచిన లారీ.. వాహనదారుల ఇక్కట్లు - పాడేరులో వాహనదారుల ఇబ్బందులు

విశాఖ జిల్లా పాడేరులో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్గంలో సిమెంట్ లారీ ఆగిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం ఇస్తేగాని ట్రాఫిక్ నియంత్రణ కరవైందని స్థానికులు వాపోతున్నారు.

Heavy traffic at paderu
రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన లారీ.. వాహనదారుల ఇక్కట్లు
author img

By

Published : Dec 22, 2020, 4:49 PM IST

విశాఖ జిల్లా పాడేరులో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై సిమెంట్​ లారీ నిలిచిపోవడంతో ట్రాఫిక్​ స్తంభించింది. ఫలితంగా వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. పాడేరులో రెండు కిలోమీటర్ల మేర ఈ మార్గంలో ఆసుపత్రి, మార్కెట్, సినిమా హాల్, సెంటర్ కాంప్లెక్స్, ఐటీడీఏ ఉండటం వల్ల వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వాహనదారులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు.

ఇవాళ భారీ సిమెంట్ లారీ రోడ్డుకు అడ్డంగా ఆగిపోయింది. ఐటీడీఏ నుంచి పాత బస్టాండ్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ విషయం ఈటీవీలో రావడం, సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావడంతో ఎస్సై శ్రీనివాస్ రంగంలో దిగారు.

మోక్షం ఎప్పుడో..?

ప్రధాన రహదారి సామర్థ్యం తక్కువగా ఉంది. వాహనాలు ఎక్కడపడితే అక్కడే నిలిపడం, మరో పక్క పర్యటకుల రాకతో రద్దీ పెరిగడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. సమాచారం ఇస్తేగాని పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కరవైందని వాపోతున్నారు. ఈ పాడేరు అరకు ప్రధాన రహదారి వాహనాల పద్మ వ్యూహానికి మోక్షం కలిగేలాలేదు.

ఇదీ చూడండి:

అధికారుల తీరుపై మనస్థాపం.. కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.