విశాఖ జిల్లా చోడవరంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్ చోడవరం కార్యాలయ పరిధిలో నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 10 వరకు స్తంభాలు పడిపోయాయి. చోడవరంలో 10 గంటల పాటు విద్యుత్ సరఫరా లేదు.
దాదాపు రూ. 1.50 లక్షల నష్టం కలిగింది. బీఎన్ దారిలో మారకమ్మరేవు వద్ద భారీ మర్రిచెట్టు కూలింది. పాడేరు, నర్సీపట్నం, చోడవరానికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో ఇటుకల బట్టీల యజమానులు లబోదిబోమంటున్నారు. ఇటుకలు, ముడి సరకు తడిసిపోయిందన్నారు.
ఇదీ చూడండి: