మన్యంలో నాలుగు రోజులుగా వర్షాలు కురువడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం కాస్త తెరిపించిన, మళ్లీ మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపిలేని వాన తో గొడుగులు దర్శనమిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో పాడేరు ఆర్టీసీ డిపో బస్సుల రాకపోకలు కాస్త ఆలస్యం అవుతోంది. దీంతో ప్రయాణీకులతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది. బస్సులు రావడంతో జనం గొడుగులు పట్టుకుని పరుగులు పెడుతున్నారు. ఎడతెరిపిలేనివానతో మన్యంలోని కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. రైతులు వర్షాన్ని లెక్కచేయకుండా గొడుగులతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోతున్నారు.
ఇదీచూడండి.ఆమె పంచ్ కొడితే.. పతకం రావాల్సిందే!