విశాఖ మన్యం కేంద్రమైన పాడేరులో సుమారు గంటసేపు భారీ వర్షం కురిసింది. ఏజెన్సీలో మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే ఎన్నికలు కావడం.. చివరి నిమిషంలో వర్షం కురవడం వల్ల ఓటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. వర్షం వల్ల కలిగిన ఆటంకాలతో మారుమూల ప్రాంతాల నుంచి పాడేరు చేరుకునే వారు సతమతమయ్యారు. అనేక చోట్ల రహదారి పక్కన వర్షం నీరు కాలువలా ప్రవహించింది. మధ్యలో వడగళ్ల వాన సైతం పడింది. చాలా కాలంగా తరువాత పడిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఇదీ చదవండి: