ఉత్తరప్రదేశ్ లో హాథ్రస్ ఘటనకు బాధ్యులైన వారిని అత్యాచారం, హత్య కేసు కింద దర్యాప్తు జరపాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మి కోరారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని అమలు పరచాలన్నారు. అత్యాచార విషయాన్ని బయటపెట్టిన వైద్యులపై కక్ష సాధింపు చర్యలు దారుణమన్నారు.
వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని బెదిరించిన జిల్లా పాలనాధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు. వారికి ప్రభుత్వం రక్షణ కల్పించి జీవనోపాధి కల్పించాలని స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: