ETV Bharat / state

'జీతాలు రాక రోడ్డున పడ్డాం... సాయం చేయండి' - ఎంపీ విజయసాయిరెడ్డి తాజా వార్తలు

గురుకుల పాఠశాల అతిథి ఉపాధ్యాయులు బుధవారం ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారు. మార్చి నుంచి తమకు జీతాలు రావటం లేదని... ఆర్థిక సాయం చేయాలని కోరారు.

Gurukul School guest teachers have asked MP Vijayasai Reddy to help them financially

author img

By

Published : Sep 2, 2020, 10:11 PM IST

తమకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల పూర్తిస్థాయి అతిథి ఉపాధ్యాయులు ఎంపీ విజయసాయి రెడ్డిని కోరారు. విశాఖ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 150 మంది ఉపాధ్యాయులు నర్సీపట్నంలో విజయసాయి రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.

కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి తమకు జీతభత్యాలు అందడం లేదని వారు ఎంపీకి వెల్లడించారు. దీనివల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనస్థితిలో ఉన్న తమకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వారికి ఎంపీ విజయసాయి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి

రైతులు ఒక్క రూపాయి చెల్లించినా.. రాజీనామా చేస్తా: మంత్రి బాలినేని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.