విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో వ్యాపార, వాణిజ్య వర్గాలతో కేంద్ర జీఎస్టీ శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. జీఎస్టీలో పరిష్కారం కాని పాత కేసులు, బకాయిలను ఒకేసారి పరిష్కరించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రవేశ పెట్టిన ఈపథకం వివరాలను జీఎస్టీ అదనపు కమిషనర్ నరసింహారెడ్డి వివరించారు. స్వచ్ఛందంగా కేసు వివరాలను తెలిపేందుకు అవకాశం కల్పించటంతోపాటు.. 50 నుంచి 70 శాతం వరకు ఊరట లభించనుందన్నారు. సెప్టెంబరు ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు పధకం అమల్లో ఉంటుందని చెప్పారు. కేంద్రం అమల్లోకి తెచ్చిన సబ్ కా విశ్వాస్ స్కీం 2019 ని వ్యాపారులు వినియోగించుకోవాలని తెలిపారు.
ఇది కూడా చదవండి.