విశాఖ మహానగరంలో చుట్టూ ఉన్న ఐదు పంచాయతీలను విలీనం చేయాలన్న ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించింది. సచివాలయంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారని భావిస్తున్న కాపులుప్పాడ పంచాయతీ వీటిలో ఒకటి. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని భీమునిపట్నం మండలంలో ఐదు పంచాయతీలను విలీనం చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌కు వీలుగా తదుపరి చర్యలు తీసుకోవాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఐదు పంచాయతీలను విలీనం చేస్తూ ఇదివరకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ.... కొందరు సర్పంచులు హైకోర్టును ఆశ్రయించటంతో విలీన జీవోను అప్పట్లో కొట్టేశారు. ప్రత్యేకాధికారుల ఆమోదంతో నగరపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జేవీ అగ్రహరం పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేశారు.
ఇదీ చూడండి: