ETV Bharat / state

విశాఖలో 'పట్టణ పేదల ఎన్నికల మేనిఫెస్టో' కార్యక్రమం

వస్తాం.. ఓటు అడుగుతాం... ప్రజలు వేస్తారు అంటే కుదరదు.. కాలం మారింది. ఓటరు మారుతున్నాడు. ఇకపై ఓటు వేయాలంటే తమ సమస్యలను పరిష్కరించాలంటూ విశాఖలోని వివిధ కాలనీల ప్రజలు కోరుతున్నారు. అందుకే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 'పట్టణ పేదల ఎన్నికల మేనిఫెస్టో'ని రూపొందించే చర్చా కార్యక్రమం చేపట్టారు.

Vishakha colonies people Discussion on 'Urban Poor Election Manifesto' at  Civil Library at vizag
విశాఖలో.. 'పట్టణ పేదల ఎన్నికల మేనిఫెస్టో'పై చర్చ
author img

By

Published : Jan 24, 2020, 9:53 PM IST

విశాఖలో.. 'పట్టణ పేదల ఎన్నికల మేనిఫెస్టో'పై చర్చ

జాతీయ ఎన్నికల వేదిక ఆధ్వర్యంలో విశాఖలో 'పట్టణ పేదల ఎన్నికల మేనిఫెస్టో' కార్యక్రమం చేపట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కాలనీల మేనిఫెస్టోను తయారు చేసేందుకు విశాఖ పౌర గ్రంథాలయంలో సమావేశమయ్యారు. 'మన ఓటు-మన భవిత' నినాదంతో నగరంలోని వివిధ కాలనీ వాసులతో చర్చలు జరిపారు. ప్రధానంగా నగరంలోని పేద, అల్పాదాయ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఈ మేనిఫెస్టో రూపొందించాలని వేదిక యత్నిస్తోందని విశ్రాంత ఐ.ఎ.ఎస్.అధికారి ఇ.ఎ.ఎస్. శర్మ అన్నారు.

ప్రజలేమంటున్నారంటే..
తాము ఓటు వేసే ప్రజాప్రతినిధి ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ కాలనీలను సందర్శించి.. సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.. తమ ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తే నోటా ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఎమ్మెల్సీ ఇంటిపై వైకాపా శ్రేణుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_24_pattana_pedala_ennikala_manifesto_ab_AP10148

( ) జాతీయ ఎన్నికల వేదిక ఆధ్వర్యంలో విశాఖలో 'పట్టణ పేదల ఎన్నికల మేనిఫెస్టో' రూపొందించే కార్యక్రమం చేపట్టారు. 'మన ఓటు- మన భవిత' నినాదంతో నగరంలోని వివిధ కాలనీ వాసులతో చర్చలు జరిపి, వారి సూచనల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాలనీల మేనిఫెస్టోను రూపొందించేందుకు విశాఖ పౌర గ్రంథాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.

Body:ప్రధానంగా నగరంలోని పేద, అల్పాదాయ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఈ మేనిఫెస్టో రూపొందించాలని వేదిక యత్నిస్తోంది.

Conclusion:తాము ఓటు వేసే ప్రజా ప్రతినిధి ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ కాలనీని సందర్శించి సమస్యల పరిష్కార పరిస్థితిని వివరించాలని కాలనీవాసులు భావిస్తున్నారు. తమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వ్యవహరిస్తే నోటా ఓటు వేస్తామని కాలనీవాసులు స్పష్టం చేస్తున్నారు.

బైట్:ఇ.ఎ.ఎస్.శర్మ,విశ్రాంత ఐ.ఎ.ఎస్.అధికారి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.