విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో మంగళవారం మిథున సంక్రమణం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత ఆస్థాన మండపంలోకి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆళ్వారులను వేంచేపు చేసి పూజలు చేశారు. అనంతరం అభిషేకాలు జరిపించి, బేడా మండపం చుట్టూ వైభవంగా తిరువీధి నిర్వహించారు.
ఇదీ చదవండి:
Endowment Tenders Dismissed: దేవాలయాల భూముల లీజు వేలం నోటీసు అమలు నిలుపుదల