ETV Bharat / state

చెరకు రైతులకు చక్కెరలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం - చక్కెర రైతులు రుణ నగదును విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం న్యూస్

చెరకు రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జాతీయ సహకారాభివృద్ధి సంస్థ మంజూరు చేసిన రుణ నగదును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

govt release funds to sugar farmers
చెరకు రైతులకు ప్రభుత్వం తీపి కబురు
author img

By

Published : Mar 18, 2020, 11:57 AM IST

చెరకు రైతులకు ప్రభుత్వం తీపి కబురు

చెరకు రైతులకు ఇది చక్కెర వంటి వార్తే. జాతీయ సహకారాభివృద్ధి సంస్థ మంజూరు చేసిన రుణ నగదును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటంతో చెరకు రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. 2018-19 సంవత్సరంలో చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు అందజేయాల్సిన నగదును చెల్లించలేదు. మార్కెట్​లో చక్కెర ధర ఆశాజనకంగా లేక రైతులు విలవిల్లాడారు. దీంతో రైతులు గతంలో నగదు చెల్లించాలని ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. ఒక పక్క రైతుల నిరసనలు, మరో పక్క ఆర్థిక కష్టాలతో చక్కెర కర్మాగారాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై జాతీయ సహకారాభివృద్ధి సంస్థ 100 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. ఈ నగదు మెుత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా మెుదటి విడతగా,30 కోట్లు విడుదలయ్యాయి.

గోవాడ కర్మాగారానికి రూ. 12.76 కోట్లు, ఏటికొప్పాకకు రూ. 7.57 కోట్లు, తాండవకు రూ. 8.66 కోట్లు, భీమిసింగ్​కు రూ. 1.06 కోట్లు కేటాయించారు. త్వరలోనే ఈ నగదును రైతులకు చెల్లించనున్నారు. ఈ వార్త నిజంగా చెరకు రైతులకు తీపి కబురే అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాదే శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.