ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలను బలోపేతం చేసే దిశగా వైద్య నిపుణులు, స్టాఫ్‌నర్స్, పారామెడికల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కొత్త పోస్టుల భర్తీలో ఏడాది కాలపరిమితిని తొలగించారు. కొవిడ్ సేవలకే పరిమితం కాకుండా సాధారణ సేవలకు ఉపయోగించనున్నారు.
భర్తీ ఇలా...
- రెగ్యులర్ పద్ధతిలో ఆంధ్రమెడికల్ కళాశాలలో 33 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు. ఇందులో క్లినికల్ డిపార్ట్‌మెంట్‌లో 10, నాన్ క్లినికల్ విభాగంలో 13, కొత్త డిపార్ట్‌మెంట్లలో 10.
- కేజీహెచ్‌లో 250, విక్టోరియా ఆసుపత్రిలో 40 రెగ్యులర్ స్టాఫ్‌నర్స్ పోస్టులు. గతంలో కేజీహెచ్‌లో ప్రకటించిన 139 పోస్టులను కలిపే ప్రకటన ఇవ్వనున్నారు.
- కేజీహెచ్‌లో రెగ్యులర్ బేసిక్ పద్ధతిలో 15 పారామెడికల్ పోస్టులు.
- కె.కోటపాడు, కోటవురట్ల, భీమునిపట్నం, నక్కపల్లి, చోడవరం, వి.మాడుగుల, ఎలమంచిలి ఆసుపత్రుల్లో 13 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు.
- పది సామాజిక ఆసుపత్రులు సహా అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో మొత్తం 12 డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)పోస్టులు.
- అరకులోయ, నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఒక్కో మత్తు వైద్య నిపుణుడు. ముగ్గురు ప్రసూతి, ఇతర వైద్య నిపుణులు.
- గతంలో పీహెచ్‌సీల్లో ఏడాది కాలానికి 39 స్టాఫ్‌నర్స్‌ల పోస్టుల కోసం 957 మంది దరఖాస్తు చేసుకున్నారు. నియామక ప్రక్రియ తుదిదశలో ఉంది. తాజాగా మరో 29 స్టాఫ్‌నర్స్ పోస్టులను మంజూరు చేశారు. వీటికి కలెక్టర్ ఆమోదంతో ప్రకటన జారీ చేయనున్నారు. ఒప్పంద పద్ధతిలో నియమించినా ఏడాది కాలపరిమితి లేదు. తొలి 39, ఇప్పుడు 29 పోస్టులకు కలిపి మరోసారి దరఖాస్తులు ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది.
- గ్రేడ్-2 ఫార్మాసిస్ట్ పోస్టులు 13, మేల్‌నర్సింగ్ (ఎంఎన్‌వో) పోస్టులు 13, ఫిమేల్ నర్సింగ్ (ఎఫ్‌ఎన్‌వో) 5 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇదీ చదవండి: గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్... కొత్త జీవితాన్ని ఇస్తోంది..!