ETV Bharat / state

విశాఖ బీచ్​ రోడ్డులో భూగర్భ మార్గం..తీరనున్న ట్రాఫిక్​ సమస్యలు - beach road in visakha latest news

విశాఖలోని బీచ్​ రోడ్డులో భూగర్భ మార్గం రూపుదిద్దుకోనుంది. కురుసురా జలాంతర్గామి నుంచి నేరుగా టీయూ-142కు చేరుకునేలా ఈ నడక దారిని అభివృద్ధి చేయనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్​ సమస్యలు తగ్గుతాయి. ఆ మార్గం గుండా పర్యాటకులకు మాత్రమే అనుమతించనున్నారు.

underway pass
విశాఖ బీచ్​ రోడ్డులో భూగర్భ మార్గం
author img

By

Published : Dec 25, 2020, 1:39 PM IST

Updated : Dec 25, 2020, 3:41 PM IST

విశాఖ బీచ్​ రోడ్డులో భూగర్భ మార్గం నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. వాహనాల రద్దీ కారణంగా ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. దీనికి పరిష్కారంగా సాగర తీర రహదారిలో సందర్శకుల కోసం భూగర్భంలో ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయనున్నారు. కురుసురా జలాంతర్గామి నుంచి నేరుగా టీయూ-142కు చేరుకునేలా ఈ నడక దారిని అభివృద్ధి చేస్తారు.

ఎనభై కోట్ల అంచనాలతో భూగర్భ పార్కింగ్‌, సమీకృత పర్యాటక, సందర్శనాలయ తీర ప్రాజెక్టును వీఎంఆర్​డీఏ ప్రతిపాదించింది. ఆర్‌కే బీచ్‌కు వచ్చే పర్యాటకులు తీరంలోని కురుసురా జలాంతర్గామి, టీయూ-142, సీహారియర్‌ , సందర్శనాలయాలను ఓకేసారి చూసేందుకు వీలుగా మార్గం నిర్మించనున్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా భూగర్భం నుంచి నేరుగా వాటిని చేరుకునేందుకు ప్రణాళిక చేశారు. కురుసురా జలాంతర్గామి నుంచి నేరుగా టీయూను చేరుకునేలా భూగర్భంలో నడకదారి ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సీహారియర్‌ మ్యూజియానికి పైనుంచి చేరుకోవాలి.

రెండు మీటర్ల వెడల్పుతో నిర్మించే భూగర్భ మార్గంలో కేవలం పర్యాటకుల రాకపోకలకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడ ఫుడ్‌ కోర్టుల ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నారు. రోడ్డుపైన వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. మొదట సీహారియర్‌ సందర్శనాలయం తరువాత భూగర్భ నడక మార్గం ఉంటుంది. ఆ తరువాత సబ్‌మెరైన్‌ మ్యూజియం, ఫుడ్‌కోర్టులుంటాయి.

ప్రస్తుతం టీయూ పక్కనున్న ఖాళీ స్థలంలో జలాంతర్గామి సందర్శనాలయం ఏర్పాటు చేయనున్నారు. దీన్ని మూడు అంతస్తుల్లో అద్భుతమైన ఆకృతిలో నిర్మించనున్నారు. జలాంతర్గాములకు చెందిన విడి భాగాలు, నౌకాదళంలో మొదట్లో వినియోగించిన వస్తువులు, వీటికి సంబంధించిన కళాఖండాలు ప్రదర్శించనున్నారు. ప్రస్తుతమున్న రాజీవ్‌ స్మృతిభవన్‌ స్థానంలో సీహారియర్‌ సందర్శనాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చిలోగా ఈ పనులు పూర్తి కానున్నాయి.

ఇదీ చదవండి: విశాఖ జిల్లా వ్యాప్తంగా క్రీస్తు వేడుకలు... చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

Last Updated : Dec 25, 2020, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.